అధికార తెరాస.. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు పోడు భూములకు పట్టాలివ్వకపోగా.. హరితహారం పేరుతో గిరిజన భూములు లాక్కుంటోందని ఆరోపించారు.
'రాష్ట్రం నుంచి తెరాసను తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలదే' - mulugu mla seethakka fires on rega kantha rao
తెలంగాణ నుంచి తెరాసను తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు మండల కేంద్రంలో పర్యటించారు.
తెరాసపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించిన సీతక్క.. తెరాసకు చిత్తశుద్ధి ఉంటే పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం పార్టీ మారిన రేగా కాంతారవు.. ఆ విషయం మర్చిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు అటవీ అధికారులను తరిమికొట్టాలని చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరిలో పోడు భూములపై ఉద్యమం చేపడతామని సీతక్క తెలిపారు.