తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత - sanitation program in manuguru

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు ప్రారంభించారు. బాలాజీనగర్​ వార్డులో పర్యటింటిన రేగా కాంతారావు... స్వయంగా క్రిమిసంహారక మందులు పిచికారి చేశారు.

పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

By

Published : Jun 1, 2020, 1:52 PM IST

పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 1 నుంచి 8 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రేగా కాంతారావు ప్రారంభించారు. బాలాజీనగర్ వార్డులో పర్యటించిన రేగా కాంతారావు స్వయంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. అనంతరం జరిగిన పట్టణ ప్రగతి ర్యాలీలో పాల్గొన్నారు.

ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా, రహదారులపై చెత్త వెయ్యకుండా పురపాలక శాఖ చర్యలు చేపట్టాలని రేగా కాంతారావు ఆదేశించారు. మణుగూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులతో కృషి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటస్వామి, జడ్పీటీసీ పోశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details