భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల నమోదు పట్టాల జారీపై గుడివాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తహసిల్దార్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రైతులకు సంబంధించిన భూముల పట్టాల విషయంలో ఆలస్యం చేయొద్దని రేగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసినా పట్టాల వివరాలను అసంపూర్తిగా ఉన్న పంట వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో, ఎఫ్ఆర్ పట్టాల జారీకి జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి: రేగా - MLA REGA KANTHARAO INSPECTED MRO OFFICE
రైతుల భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడి త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పట్టాల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

MLA REGA KANTHARAO INSPECTED MRO OFFICE