భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖపై సమర శంఖారావానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శెట్టిపల్లికి తరలివెళ్తున్న పోడు రైతులు, గిరిజనులు, తెరాస కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై శ్రీధర్ పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో అటవీ శాఖపై విమర్శలు చేశారు.
ప్రజలే లేనప్పుడు అధికారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన ఆయన.. చలో శెట్టిపల్లికి పిలుపునిచ్చారు. ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.