తెలంగాణ

telangana

ETV Bharat / state

మన్యం మాసపత్రికను విడుదల చేసిన రేగా కాంతారావు - World traibals day celebration s in managuru

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్యం మనుగడ మాసపత్రికను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విడుదల చేశారు. అంతకుముందు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.

మన్యం మాసపత్రికను విడుదల చేసిన రేగా కాంతారావు
మన్యం మాసపత్రికను విడుదల చేసిన రేగా కాంతారావు

By

Published : Aug 9, 2020, 3:06 PM IST

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఆదివాసీల జీవన ప్రమాణాల పెద్దగా మారలేదని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్యం మనుగడ మాసపత్రికను విడుదల చేశారు. ఆదివాసీలు సమాజంలోని అన్ని వర్గాలతో పోటీపడలేక పోతున్నారని చెప్పారు.

అంతకుముందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.

ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'

ABOUT THE AUTHOR

...view details