తన స్నేహితుడైన వైఎస్ ఎంపీపీ పఠాన్ ఆయూబ్ ఖాన్ అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పాడె మోశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురంలో గుండెపోటుతో మరణించగా.. తన చిన్ననాటి స్నేహితుడి మృతదేహం వద్ద రేగా కన్నీటి పర్యంతమయ్యారు.
వైస్ ఎంపీపీ అంత్యక్రియల్లో పాల్గొన్న రేగా కాంతారావు - నివాళులర్పించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వైస్ ఎంపీపీ గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మృతుడి స్వగ్రామానికి చేరుకుని నివాళులర్పించారు. తానే స్వయంగా పాడె మోశారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఆయూబ్ ఖాన్... అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైదరాబాద్ నుంచి వచ్చి.... స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.