తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్‌ బోల్తా ఘటన బాధితులకు 'ఎమ్మెల్యే రేగా' ఆర్థిక సాయం - mla rega kantha rao news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలోని మృతుల కుటుంబాలకు.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం శంభుని గూడెంలో పోడు భూముల ఘర్షణకు సంబంధించి వివరాలను.. గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

mla rega kantha rao
ఎమ్మెల్యే రేగా కాంతారావు

By

Published : Feb 14, 2021, 6:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలకు.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆర్థిక సాయం అందజేశారు. విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందించారు. గాయపడిన వారికి రూ.పది వేలు చొప్పున సాయం చేశారు.

అనంతరం శంభుని గూడెంలో ఇటీవల పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య తలెత్తిన ఘర్షణ వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. పోడు భూముల ఘర్షణలో కాచనపల్లి ఎస్సై.. గ్రామస్థులను దుర్భాషలాడారని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

పోడు భూముల రైతులతో ఎమ్మెల్యే రేగా కాంతారావు

ఇదీ చదవండి:'వాలెంటైన్స్ డే కు విరుద్ధంగా ప్రజలను చైతన్యం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details