తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏరువాక షురూ.. నాగలి పట్టిన ఎమ్మెల్యే - Waira News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వైరా ఎమ్మెల్యే ల్పయావుడా రాములు నాయక్​ ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినోభా నగర్​ సమీపంలోని రైతు పొలంలో పూజలు చేసి అరక కట్టి దుక్కి దున్నారు. ఆధునిక, సేంద్రీయ పద్ధతులు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందాలని ఆకాంక్షించారు.

MLA RAMULU NAIK STARTS ERUVAK IN WAIRA
ఏరువాక ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్

By

Published : Jun 6, 2020, 3:52 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్​ ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినోభా నగర్​ సమీపంలోని పొలంలో పూజలు చేసి అరక కట్టి దుక్కి దున్నారు. ఆధునిక, సేంద్రియ పద్ధతులు పాటించి రైతులు లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తూ..అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు.

రైతుబంధు, రైతు రుణమాఫీ పథకాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు బాగు ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీడు భూములు సాగుభూములయ్యాయని.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో చెరువులు, కుంటలు నింపి రాష్ట్రంలో సాగు భూమి పెరిగిందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సీతారామ ప్రాజెక్టు వరప్రదాయిని అని.. లక్షల ఎకరాలు సాగునీరు వస్తాయని అన్నారు.

ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details