ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పడమటి నరసాపురంలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఆపత్కాలంలోనూ సంక్షేమ ఫలాలు అమలు: ఎమ్మెల్యే రాములు నాయక్ - తెలంగాణ వార్తలు
కరోనా ఆపత్కాలంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే రాములు నాయక్, కొవిడ్ కేంద్రం ప్రారంభం
కరోనా ఆపత్కాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు లెల్ల వెంకట రెడ్డి, ఎంపీపీ సోనియా, జడ్పీటీసీ కళావతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా