రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచే పోటీ చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించారని.. వారికి చేసిన మంచి పనులకు మళ్లీ గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ: పొదెం వీరయ్య - భద్రాచలం తాజా వార్తలు
భద్రాచలం ప్రజలే తనకు దేవుళ్లని.. భద్రాచలం శాసనసభకు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్ప ఏ ఇతర పార్టీ నుంచి పోటీ చేయనని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
podem veeraiah speech
అధిష్ఠానం నిర్ణయం ప్రకారం టికెట్ల కేటాయింపు ఉంటుందని వీరయ్య పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రకటించిన ప్రకారమే మండల అధ్యక్షుల నియామకం ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 22, 2022, 9:22 PM IST