భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. పట్టణ పరిశుభ్రత కోసం ఇప్పటికే పలు వార్డుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా పనిచేస్తున్నారని చెప్పారు.
పరిశుభ్రత ముఖ్యం: ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
రోగాలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు. ఇల్లందులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే వాహనాన్ని ప్రారంభించారు.
పరిశుభ్రత ముఖ్యం: ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
రోగాలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం 14 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఇవీ చూడండి:హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్