తడి, పొడి చెత్త నిర్వహణ చేపట్టి... ఇల్లందు పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త వేర్వేరుగా తరలించే 20 నూతన వాహనాలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు. అనంతరం లలిత కళా మందిర్ సమీపంలో నిర్మించనున్న స్లాటర్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఇల్లందు పరిశుభ్రతకు పాటుపడాలి: ఎమ్మెల్యే హరిప్రియ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లేటెస్ట్ న్యూస్
ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. తడి, పొడి చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టి ఇల్లందు పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. చెత్తను తరలించే 20 నూతన వాహనాలను, ఇల్లందు పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు.
ఇల్లందు పరిశుభ్రతకు పాటుపడాలి: ఎమ్మెల్యే హరిప్రియ
ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.