భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. కేంద్రంలో 50 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆమె వివరించారు.
ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - ఆక్సిజన్ కొరత
ఎమ్మెల్యే హరిప్రియ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు.. వైద్య సిబ్బందికి అన్నివేళలా సహకరిస్తారని ఆమె హామీ ఇచ్చారు.

isolation center at illandu
కొవిడ్ బాధితులు.. ఆక్సిజన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రయాణంలో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నందున.. ఆక్సిజన్ సదుపాయంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు.. వైద్య సిబ్బందికి అన్నివేళలా సహకరిస్తారని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'బొల్లారం ఆస్పత్రిలో కొవిడ్ సేవలు, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం'