తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్లీన్​ అండ్​ గ్రీన్​ సిటీగా ఇల్లందు.. ఇదే లక్ష్యం' - తెలంగాణ తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్పెషల్ శానిటైజ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లీన్​ అండ్​ గ్రీన్​ సిటీగా ఉంచడమే లక్ష్యంగా పాలకవర్గం పని చేస్తుందని.. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ పేర్కొన్నారు.

clean and green
clean and green

By

Published : May 20, 2021, 5:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణాన్ని క్లీన్​ అండ్​ గ్రీన్​ సిటీగా ఉంచడమే లక్ష్యంగా పాలకవర్గం పని చేస్తుందని.. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. ఇల్లందు పట్టణంలో స్పెషల్ శానిటైజ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న వర్షకాలంలో దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని డ్రైనేజ్ వ్యవస్థను పరిశుభ్రం చేసి.. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను అన్నింటినీ తొలగించాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details