భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి స్కూల్ ప్రాంగణంలో స్పైడర్ వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Vaccine: స్పైడర్ వ్యాక్సిన్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ - Telangana news
ఇల్లందులో ఏర్పాటు చేసిన స్పైడర్ వ్యాక్సిన్ సెంటర్ ను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరిశీలించారు. కొవిడ్ బాధితులకు దాతలు సహాయ సహకారాలు అందించడాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం చిరాగ్ ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన 2 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను… జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్, పురపాలక ఛైర్మెన్ వెంకటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మెన్ హరిసింగ్లతో కలిసి ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడికి అందజేశారు. కొవిడ్ వంటి విపత్కర సమయంలో పలువురు దాతలు వైద్య పరికరాలు కొవిడ్ బాధితులకు సహాయ సహకారాలు అందించడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ తరపున ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.