భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక కార్యాలయంలో పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హాజరయ్యారు. రేపటి నుంచి నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే: హరిప్రియ నాయక్ - pattana pragathi
పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియ నాయక్