భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇల్లందు మున్సిపాలిటీ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు సింగరేణి పాఠశాలల్లో ఓటు వేశారు.
ఓటు వేసిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే దంపతులు ఓటు వేశారు.
ఓటు వేసిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
కొవిడ్ నిబంధనలు అనుసరించి ఓటు వేసేందుకు వస్తున్న వారికి థర్మో స్క్రీనింగ్ చేశారు. శానిటైజర్ ఇస్తూ మాస్కులు ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. ఇల్లందు సింగరేణి పాఠశాల పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని జనాల్ని పంపించేశారు.
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు