తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటర్ల నమోదుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి' - ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వార్తలు

ఓటర్ల నమోదుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని హరిప్రియ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని పల్లా రాజేశ్వర్ ​రెడ్డి విమర్శించారు.

mla haripriya mlc palla rajeshwar reddy review on mlc elections
'ఓటర్ల నమోదుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి'

By

Published : Oct 9, 2020, 4:40 PM IST

ఓటర్ల నమోదుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3,300 పైగా పట్టభద్రుల ఓటర్ల నమోదు పూర్తైందని... ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని హరిప్రియ తెలిపారు.

అసత్య ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు తాతా మధు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బైక్​పై​ వెళ్తున్న ప్రేమజంటపై సినీ ఫక్కీలో దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details