తెలంగాణ

telangana

ETV Bharat / state

'అందరికీ క్రమబద్ధీకరణ పట్టాలు అందించేందుకు కృషి' - ఇల్లందులో క్రమబద్ధీకరణ పట్టాలు

ఇల్లందులో క్రమబద్ధీకరణ పట్టాలను ఎమ్మెల్యే హరిప్రియ అందజేశారు. మొత్తం 3,500 మంది ధరఖాస్తులు చేసుకోగా.. 1,650 మందికి ఇప్పటివరకు పట్టాలు వచ్చాయి. మిగిలిన వారి పట్టాల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.

mla Haripriya, regularization certificates, yellandu
mla Haripriya, regularization certificates, yellandu

By

Published : May 8, 2021, 10:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక కార్యాలయంలో... లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలను ఎమ్మెల్యే హరిప్రియ అందజేశారు. మొత్తం 3,500 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,650 మందికి మాత్రమే ఇప్పటివరకు పట్టాలు వచ్చాయి.

మిగిలిన వారికి వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన విషయాన్ని అధికారులకు సూచిస్తూ.. వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. జీవో నంబర్ 76 ప్రకారం ప్రభుత్వం అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కృష్ణవేణి, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్టణాల్లో వైరస్ కట్టడికి పురపాలకశాఖ ప్రత్యేక చర్యలు

ABOUT THE AUTHOR

...view details