భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి సంస్థ రూ.1,361 కోట్లతో సోలార్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. టేకులపల్లి మండలం ఆరో మైల్ ప్రాంతంలో వానరాల కోసం అరటి, జామపండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నియోజకవర్గంలో కోతుల బెడద నివారణకు హరిత హారంలో భాగంగా ఇప్పటికే పండ్ల మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సోలార్ హబ్ ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
ఇల్లందులో సింగరేణి సంస్థ రూ.1,361 కోట్లతో సోలార్ హబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన తెరాస కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కును అందజేశారు. నియోజకవర్గం పరిధిలో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
![సోలార్ హబ్ ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే mla haripriya fruit distribution program for monkeys](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10201231-386-10201231-1610364261172.jpg)
సోలార్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం
సుభాష్ నగర్ పంచాయతీ పరిధిలో ఇటీవల ప్రమాదంలో మరణించిన తెరాస కార్యకర్త ఎడారి వెంకటేష్ కుటుంబానికి... రూ.2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ఆపద సమయంలో కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ముతో కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గ్రామంలో తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం