భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుతో పాటు బయ్యారం, గార్లకామేపల్లి, టేకులపల్లి మండలాల్లో లాక్డౌన్ నిబంధనలను నిత్యం పర్యవేక్షిస్తూ బిజీబిజీ గడుపుతున్న ఎమ్మెల్యే హరిప్రియ నేడు తన వ్యవసాయ భూమిలో వరికోత వాహనాన్ని నడుపుతూ సరదాగా గడిపారు.
వరికోత వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ - ఎమ్మెల్యే హరిప్రియ వరికోత యంత్రాన్ని నడిపారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఉన్న తన పొలంలో వరికోత వాహనాన్ని నడుపుతూ ఎమ్మెల్యే హరిప్రియ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు.
![వరికోత వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ mla haripriya drive paddy cutting machine in tekupalli bhadradri kothagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6928152-355-6928152-1587740954410.jpg)
వరికోత వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ
వ్యవసాయ పనులపై పట్టు ఉన్న ఎమ్మెల్యే ట్రాక్టర్ నడపడం, వరికోత యంత్రం నడపడం వంటివి ఆమెకు వ్యవసాయం పట్ల ఎంత మక్కువందో తెలియజేస్తున్నాయి.
ఇవీచూడండి:తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్
TAGGED:
latest news of mla haripriya