భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యాక్రమం ఏర్పాటు చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొని.. 21 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను అందజేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ
కార్యక్రమంలో టేకులపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసరావు, సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఎంపీపీ రాధా, పలువురు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'గిరిజనుల అభ్యున్నతి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది...?'