భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హరిప్రియ దోమ తెరలను పంపిణీ చేశారు. మామిడి గూడెం సత్యనారాయణపురం ఇందిరానగర్ పంచాయతీ పరిధిలో ఆరోగ్య కేంద్రాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వీటిని పంపిణీ చేశారు. ఈ దోమతెరలు నాణ్యతతో ఉండి.. ఎంతో వ్యయంతో.. ప్రజారోగ్యం దృష్ట్యా ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా నివారణలో భాగంగా పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాధులు ప్రబలకుండా వీటి వినియోగాన్ని గుర్తించాలని కోరారు.
దోమతెరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - Bhadradri kothagudem district Latest news
మలేరియా ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా దోమ తెరల వినియోగాన్ని గుర్తించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు గ్రామాల్లో దోమతెరలు పంపిణీ చేశారు.
MLA Haripriya distributes mosquito nets
మలేరియా ప్రభావిత గ్రామాల్లో దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటానికి ఈ దోమతెరలు పంపిణీ జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమం కింద వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, వైద్యుడు డాక్టర్ సురేష్ ప్రజాప్రతినిధులు నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: chandra mohan: అభినయ వేదం 'చంద్రమోహనం'