తెలంగాణ

telangana

ETV Bharat / state

హోప్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే

హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను ఎమ్మెల్యే హరిప్రియ విద్యార్థులకు పంపిణీ చేశారు. ట్రస్ట్ సేవలు అమోఘమని... పుస్తకాలు, దుప్పట్లు అందించడం అభినందనీయని ఎమ్మెల్యే కొనియాడారు.

MLA Haripriya at the Hope Charitable Trust distribution of daily necessities
హోప్ చారిటబుల్ ట్రస్ట్ నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Dec 30, 2020, 7:32 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిరుపేద విద్యార్థులకు ఎమ్మెల్యే హరిప్రియ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 500 మందికి పుస్తకాలు, దుప్పట్లు అందించారు.

ఖమ్మంలో సంస్థ ఉన్నప్పటికీ ఇల్లందు మండలంలోని వారికి సహాయం అందించడం గొప్ప విషయం. ట్రస్ట్ ద్వారా కృప ఎల్లయ్య చేస్తున్నసేవలు అమోఘం. కొవిడ్​ వేళ గురుకుల విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ ఆన్​లైన్ తరగతుల్లో విద్యభ్యసిస్తున్నారు. అటువంటి వాళ్ళకు పంపీణీ చేయడం అభినందనీయం.

-హరిప్రియ, ఎమ్మెల్యే

కార్యక్రమంలో.. జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ హరిసింగ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరీంనగర్​ స్మార్ట్​ సిటీ నిధులను ఎవరూ ఆపలేరు: వినోద్​కుమార్​

ABOUT THE AUTHOR

...view details