తెలంగాణ

telangana

ETV Bharat / state

తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే హరిప్రియ - ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ వార్తలు

తడి, పొడి చెత్తను వేరుగా వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ. పట్టణాన్ని పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.

mla haripriya awareness programme in yellandu at bhadradri kothagudem
తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Aug 24, 2020, 8:49 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పదో వార్డులో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరి కృషి చేయాలని... తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని అవగాహన కల్పించారు.

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆమె అభినందనలు తెలియజేశారు. ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని సూచించారు.

ఇదీ చూడండి:తెలంగాణ, ఏపీల మధ్య త్వరలోనే బస్సు సర్వీసుల పునః ప్రారంభం!

ABOUT THE AUTHOR

...view details