తెలంగాణ

telangana

ETV Bharat / state

బీట్ ఆఫీసర్ విద్యకు ఎమ్మెల్యే హరిప్రియ అభినందన - ఇల్లందు వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఒకటవ వార్డులో దశాబ్దాలుగా వైకుంఠధామం నిర్మించదలిచిన స్థలం అటవీ శాఖ అధికారులతో వివాదాస్పదంగా మారింది.

బీట్ ఆఫీసర్ పనితీరు మెచ్చుకున్న ఎమ్మెల్యే
బీట్ ఆఫీసర్ పనితీరు మెచ్చుకున్న ఎమ్మెల్యే

By

Published : Oct 11, 2020, 11:34 AM IST

అనుమతుల్లేకుండా అటవీ శాఖ స్థలంలో చేపట్టిన వైకుంఠాధామం పనులను అడ్డుకున్నారు ఓ ఫారెస్ట్ అధికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఒకటవ వార్డులో దశాబ్దాలుగా వైకుంఠధామం నిర్మించదలిచిన స్థలం అటవీ శాఖ అధికారులతో వివాదాస్పదంగా మారింది. అటవీ శాఖ స్థలంలో చదునుచేసి ఉండడాన్ని గమనించిన బీట్ ఆఫీసర్ విద్య... రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేశారు.

ఈ విషయం ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి వెళ్లగా... స్థలానికి చేరుకుని వైకుంఠధామం కోసం మాత్రమే పనులు జరుగుతున్నాయని బీట్ ఆఫీసర్ విద్యకు తెలియజేశారు. కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలని అధికారులు ఎమ్మెల్యేకి తెలియజేసినట్టు ఎఫ్ఆర్వో రవి కిరణ్ తెలిపారు. బీట్ ఆఫీసర్ పనితీరు మెచ్చుకున్న ఎమ్మెల్యే హరిప్రియ జిల్లా అధికారులకు దీని విషయమై అనుమతి కోరుతామని చెప్పారు.

ఇవీ చూడండి: దుబ్బాకలో ఊపందుకున్న ఉపఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details