వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
'వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం'
తెలంగాణలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం'
తెలంగాణ వరి సాగులో దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు రానుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మస్తాన్ రావు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ