భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మామిడి గుండాలలో భూస్వాములకు, ఆదివాసీలకు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్య పరిష్కారానికై ఎమ్మెల్యే హరిప్రియ సమావేశం ఏర్పాటు చేశారు. సరిహద్దులు చూపక పోవడమే ప్రధాన సమస్యగా ఉన్నా.. పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు ప్రారంభించి ఇప్పటికే కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని.. ఒకరిద్దరి కోసం సమస్యను జఠిలం చేయొద్దని ఆమె కోరారు.
దశాబ్దాల భూ సమస్యను పరిష్కరిస్తా.. సహకరించండి: ఎమ్మెల్యే హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామిడి గుండాలలో భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని.. సహకరించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషిచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
'దశాబ్దాల భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా... సహకరించండి'
పూర్తిస్థాయిలో భూములను సర్వే చేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతు బంధు పథకం రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దశాబ్దాల సమస్య పరిష్కారానికి ప్రతిఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'