తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కాన్వాయ్​ని అడ్డగించిన గుండెపుడి గ్రామస్థులు - భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపుడిలో ఎమ్మెల్యే రాములు నాయక్​ కాన్వాయ్​ని గిరిజనులు అడ్డుకున్నారు. గ్రామంలో తాగునీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యేకు వినిపించారు.

mla convoy  Intercepted by bhadradri kothagudem citizens
ఎమ్మెల్యే కాన్వాయ్​ని అడ్డగించిన గుండెపుడి గ్రామస్థులు

By

Published : Jan 3, 2020, 12:08 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరపాడు మండలంలో రెండో విడత పల్లె ప్రగతి తొలిరోజే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. గుండెపుడిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే రాములునాయక్‌ కాన్వాయ్‌ను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆ గ్రామంలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే రాములునాయక్‌ కారు దిగి వారితో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని, చేతిపంపుల్లో నీరు ఎర్రగా కలుషితంగా ఉంటున్నాయని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.

ఎమ్మెల్యే కాన్వాయ్​ని అడ్డగించిన గుండెపుడి గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details