తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​​లైన్​ లీకేజ్​.. ఎగిసి పడుతున్న నీరు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని నవభారత్ వద్ద మిషన్ భగీరథ పైప్​లైన్​ లీకై... నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. జాతీయ రహదారి పక్కనే ఈ పైప్ ​లైన్​ ఉండడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Mission Bhagiratha pipeline leak in Bhadradri kothagudem district
భద్రాద్రి జిల్లాలో మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​

By

Published : Apr 24, 2021, 9:18 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​ అయ్యింది. పాల్వంచ సమీపంలోని నవభారత్ వద్ద పైపు పగిలిపోవడంతో నీరు ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. నీరు ఆకాశానికి ఎగజిమ్మిన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా రోడ్డు పైకి వచ్చారు.

మిషన్​ భగీరథ పైప్​​లైన్​ లీకేజ్​.. ఎగిసి పడుతున్న నీరు

జాతీయ రహదారి పక్కనే ఈ పైప్​ లైన్​ లీక్ కావడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా చేశారు.

ABOUT THE AUTHOR

...view details