భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం పినపాక పార్టీ నగర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి భార్య ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వర్లు మూగ కావడం వల్ల 2018 ఏప్రిల్ నెలలో పనికి వెళ్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల కుటుంబసభ్యులు చివరికి బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గ్రామస్థుడి సహాకారంతో...
వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ అనే యువకుడు టిక్‌టాక్‌లో.. పంజాబ్ లూథియానాలో లాక్డౌన్ సందర్భంగా అక్కడి పోలీసులు భిక్షాటన చేస్తున్న వెంకటేశ్వర్లుకు భోజనం పెడుతున్న వీడియోను చూశాడు. టిక్‌టాక్ చూసిన నాగేంద్ర ప్రసాద్... బాధిత కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశాడు.