భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమల్లలో జీసీసీ ఆధ్వర్యంలో రూ.33 లక్షలతో నిర్మించిన కారం తయారీ కేంద్రాన్ని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. రోజుకు 15 క్వింటాళ్ల కారం, 8 క్వింటాళ్ల పసుపు.. ఉత్పత్తి సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారని అధికారులు తెలిపారు.
కారం తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు - సుదిమల్ల కారం తయారీ కేంద్రం
భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. సుదిమల్లలో రూ.33 లక్షలతో నిర్మించిన కారం తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ముచ్చర్లలో మునగాకు పరిశ్రమను ప్రారంభించారు.
కారం తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు
పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు కందకం పనులు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని మంత్రులకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. పోడు భూముల్లో అటవీశాఖ దాడులను ఆపాలని కోరారు. అనంతరం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లలో మునగాకు పరిశ్రమను మంత్రులు ప్రారంభించారు.
ఇదీ చూడండి: త్వరలో జీహెచ్‌ఎంసీలో సంచార చేపల మార్కెట్లు: తలసాని