తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఏడు మండలాలను తెలంగాణకు ఇచ్చేయండి: మంత్రి - ఏడు మండలాలు తిరిగివ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

కుట్రపూరితంగా ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్​ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు.

minister sinivas goud demands to give back seven mandals merged in ap
ఆ ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

By

Published : Jan 30, 2021, 4:22 PM IST

ఏపీలో కలిపిన భద్రాద్రి సరిహద్దు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కుట్రపూరితంగా 7 మండలాలను ఏపీలో కలిపారని ఆరోపించారు. 1800 ఎకరాల దేవుని భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం జోక్యం చేసుకొని కనీసం 6 గ్రామాలను భద్రాచలంలో విలీనం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాద్రిని టెంపుల్​ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరగా... యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్ గౌడ్‌ స్పష్టం చేశారు. రూ.100 కోట్లతో భద్రాద్రిని అభివృద్ధి చేసేందుకు సీఎం ఆలోచన చేశారని వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌, తో కలిసి ప్రారంభించారు. అనంతరం జీసీసీలోని గిరిజనుల సబ్బుల తయారీ కేంద్రాన్ని, పిల్లల పార్కు, ఐటీడీఏ పౌష్టికాహార తయారీ కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్​తో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఐటీడీఏ కార్యాలయంలో 170 టాటా ట్రాలీ వాహనాలను గిరిజన యువతకు అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా, ఎంపీ మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతం, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఆ ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

ఇదీ చూడండి:'పోలవరంతో భద్రాద్రి కోవెలకు ముంపు వాటిల్లితే ఊరుకోం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details