ప్రభుత్వం అందించే బియ్యం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష - మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా ప్రభావం దృష్ట్యా అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష
కరోనా ప్రభావం నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల మంది లబ్ధిదారులతో పాటు ఇతర రాష్ట్రాల కూలీలకు బియ్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా సోకిన నలుగురు బాధితుల్లో ముగ్గురు కోలుకున్నారని.. ఒకరు చికిత్స పొందుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లాక్డౌన్ వల్ల ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.