భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందించే అంశంపై ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఈఎన్సీ మురళీధర్, అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. నియోజక వర్గ పరిధిలో ప్రస్తుతం నీరు అందని భూమి ఎంత ఉందో సర్వే చేసి పది రోజుల్లో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఎకరాకు నీరు అందించే మార్గాలు, నీటి లభ్యతపై సమగ్ర ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని సూచించారు.
'ఇల్లందులోని ప్రతి ఎకరాకు సాగు నీరందించాలి' - గిరిజన, మహిళా సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించే ప్రణాళికల్లో భాగంగానే ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని గిరిజన, మహిళా సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఇంజినీర్లను ఆదేశించారు.
!['ఇల్లందులోని ప్రతి ఎకరాకు సాగు నీరందించాలి' minister sathyavathi rathode latest newsminister sathyavathi rathode latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7129744-88-7129744-1589029149841.jpg)
ప్రస్తుతం ఉన్న చెరువుల విస్తీర్ణం పెంచుకోవడం వల్ల నీరందించే అవకాశం ఎంతవరకు ఉంది, లేదంటే కొత్త జలాశయాల నిర్మాణ సాధ్యాసాధ్యాలను నివేదికలో పొందుపర్చాలని ఈఎన్సీ మురళీధర్ ఇంజినీర్లకు తెలిపారు. రోళ్లపాడు, లలితాపూర్ చెరువు బయ్యారం చెరువు వరకు పొడగించేలా చూడాలని చెప్పారు. కాళేశ్వరం జలాలతో వేసవిలోనూ మహబూబాబాద్ జిల్లాలో చెరువులు మత్తడి పోస్తున్నాయని... ఈ చెరువుల్లోని నీరు ప్రతి ఎకరాకు చేరే విధంగా ఓటీలు నిర్మించాలని మంత్రి తెలిపారు. ఈ రెండు నెలల్లోనే కాలువల నిర్మాణం, మరమ్మత్తులు, ఓటీలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించేలా పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్