తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధికి కరోనా అడ్డంకి కాకూడదు: మంత్రి అజయ్​కుమార్ - minister puvvada ajaykumar started development works at bhadradri district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, సుజాతనగర్​ మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ శంకుస్థాపన చేశారు. కరోనా వేగంగా ప్రబలుతున్నా.. అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వచ్చిన వారిని మంత్రి అభినందించారు.

minister puvvada ajaykumar started  development works at bhadradri district
అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన

By

Published : Jun 18, 2020, 2:08 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మంత్రితో కలిసి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు పాల్గాన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాడ్డ తర్వాత అనేక అభివృద్ధి పనులను నిర్వహించినట్లు మంత్రి పువ్వాడ సుజాతనగర్​లో ఏర్పాటు చేసిన సభలో పేర్కొన్నారు.

జిల్లాకు అవసరమైన అనేక సదుపాయాలను సమకూర్చుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్నా అభివృద్ధి పనులను నిర్వహించుకునేందుకు ముందుకు వచ్చిన వారందరినీ మంత్రి అభినందించారు.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details