భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముడూడెం, చర్ల మండలాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలం సారపాకలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి మొక్కలు నాటారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన పువ్వాడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటించారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన పువ్వాడ
దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం, రైతుబంధు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపనల కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం భద్రాచలంలోని శిశు మందిర్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ సెంటర్లో పలువురు సీపీఎం నేతలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నాయకులను అరెస్టు చేశారు.
ఇదీచూడండి: అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది: కేసీఆర్