భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వచ్చే నెల 2న జరగనున్న సీతారాముల కల్యాణం ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీరామనవమికి వచ్చే భక్తులు సంఖ్య నానాటికి తగ్గుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి.
భద్రాద్రిలో సీతారాముల కల్యాణంపై మంత్రి సమీక్ష - tranceport minister minister puvvada ajay kumar latest news
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాద్రి సీతారాముల కల్యాణంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భద్రాద్రిలో సీతారాముల కల్యాణంపై మంత్రి సమీక్ష
కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత తలంబ్రాల పంపిణీ, ప్రసాదాల అమ్మకాలు, టిక్కెట్ల విక్రయాలు విషయంలో ఆలయ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇవీ చూడండి:రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా
TAGGED:
badrachalam latest news