Puvvada on AP Ministers: ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు. హైదరాబాద్ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు. నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్రజలకు కూడా బాధగానే ఉంటుందని మంత్రి పువ్వాడ తెలిపారు.
Puvvada on AP Ministers: జగన్‌తో చర్చించి ఐదు గ్రామాలు ఇప్పించలేరా?: పువ్వాడ అజయ్ - ఏపీ మంత్రులపై పువ్వాడ
16:46 July 19
Puvvada on AP Ministers: ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరం: పువ్వాడ
జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి. 5 గ్రామాలను కలిపితేనే కరకట్టల నిర్మాణం సాధ్యం. సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. బేషజాలకు పోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలి.- పువ్వాడ అజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
భద్రాచలం ఆలయం మునగకుండా ఉండాలనేది మా ఉద్దేశమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌తో జగన్ చర్చలకు బొత్స, అంబటి కృషి చేయాలని సూచించారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలంటే ఏపీ సహకరించాలని పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు.