రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయాల్సిన రైతు వేదికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని బూర్గంపాడు మండలం మొరంపల్లిలో ఏర్పాటు చేయనున్న రైతువేదిక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన - minister puvvada ajay kumar laid foundation stone at bhadradri district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లిలో ఏర్పాటు చేయనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. జిల్లాలో జరుగుతున్న రైతు వేదిక భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి సూచించారు.
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన
కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, కలెక్టర్ ఎన్వీ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి అన్నారు. రైతులందరూ సీఎం సూచించినట్లు ఆయా పంటలను వేసి రైతు బంధు పథకం తీసుకోవాలని సూచించారు.