రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి.. లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకున్నారు.
భద్రాద్రి రాముడి సేవలో మంత్రి నిరంజన్ రెడ్డి.. - minister niranjan visited bhadradri temple
తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.
భద్రాద్రి రాముడి సేవలో మంత్రి నిరంజన్ రెడ్డి
ఆలయ అర్చకులు మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రసాదాన్ని అందజేశారు. కరోనా దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే భద్రాద్రి సన్నిధిలో రద్దీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :గచ్చిబౌలి ఐటీ కారిడార్లో చిరుత సంచారం!