తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందులో మంత్రి కేటీఆర్​ పర్యటన - ఖమ్మంలో మంత్రి కేటీఆర్​ పర్యటన

ఖమ్మం పర్యటన అనంతరం మంత్రి కేటీఆర్​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించారు. పట్టణంలోని మల్టీ యుటిలిటీ సెంటర్​, పార్క్​, మార్కెట్​ నిర్మాణాల శిలా ఫలకాలను ఆవిష్కరించారు.

minister ktr visited ellandu and inaugurated parks
ఇల్లందులో మంత్రి కేటీఆర్​ పర్యటన

By

Published : Mar 1, 2020, 10:27 PM IST

ఇల్లందు పట్టణ సమస్యలపై మంత్రుల బృందంతో ముఖ్యమంత్రిని కలుస్తామని కేటీఆర్​ తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని భద్రాద్రి జిల్లా ఇల్లందుకు వచ్చిన కేటీఆర్​కు ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియనాయక్​, శంకర్​నాయక్​, ఇతర నేతలు స్వాగతం పలికారు.

పట్టణంలోని మల్టీ యుటిలిటీ సెంటర్​, పార్క్​, మార్కెట్​ నిర్మాణాల శిలా ఫలకాలను ఆవిష్కరించారు. పురపాలక ఎన్నికలకు ముందు ఇల్లందు పట్టణాన్ని కేటీఆర్​ దత్తత తీసుకుంటారని స్థానిక నేతలు ప్రకటించినా.. ప్రసంగంలో దత్తత అంశంపై కేటీఆర్​ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇల్లందులో మంత్రి కేటీఆర్​ పర్యటన

ఇవీచూడండి:కేటీఆర్​ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం

ABOUT THE AUTHOR

...view details