భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్-2 సింక్రనైజేషన్‌ను శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సింక్రనైజేషన్‌తో ఉత్పత్తయిన 50 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
పినపాకలో పూర్తయిన బీటీపీఎస్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ - minister jagadish reddy started btps unit 2 synchronization
హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యూనిట్-2 సింక్రనైజేషన్‌ను స్విచ్ ఆన్ చేసి శుక్రవారం ప్రారంభించారు. త్వరలోనే రెండో యూనిట్ సీవోడీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పినపాకలో పూర్తయిన బీటీపీఎస్ రెండో యూనిట్ సింక్రనైజేషన్
కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లోనూ సింక్రనైజేషన్ విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అధికారులు, ఇంజినీరులను మంత్రి అభినందించారు. త్వరలోనే రెండో యూనిట్ సీవోడీని పూర్తి చేయాలని అధికారులకు దృశ్య మాధ్యమ సమీక్షలో తెలిపారు. డిసెంబర్ 2020లో యూనిట్ 3 సీవోడీ, యూనిట్ 4 సింక్రనైజేషన్ పూర్తి చేసేలా ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
TAGGED:
btps unit 2 synchronization