భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కల్యాణోత్సవానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.
భద్రాద్రిలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాద్రి ఉత్సవమూర్తులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసారీ భక్తజనుల సందడి లేకుండానే కల్యాణం సాగుతోంది.
రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
భద్రాచల క్షేత్రంలో ఏడాదికోసారి జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఎంతో విశిష్టమైనది. జగత్ కల్యాణంలో ప్రతి ఘట్టం మధురమే. దాంపత్యానికి... దివ్యత్వాన్ని ఆపాదించింది సీతారాములే.
ఇదీ చూడండి :శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?