ఇటీవలే కరోనాతో మృతి చెందిన భద్రాచలం-కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ నరేశ్‌కు మంత్రి ఈటల రాజేందర్ నివాళులర్పించారు. సచివాలయంలో వారి కుటుంబ సభ్యులను కలిశారు. డాక్టర్ నరేశ్ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
డీఎంహెచ్ఓ డా. నరేశ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి ఈటల
కరోనాతో మృతి చెందిన భద్రాచలం-కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ నరేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. సచివాలయంలో వారి కుటుంబ సభ్యులను మంత్రి కలిశారు.
డీఎంహెచ్ఓ డా. నరేశ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి ఈటల
ప్రభుత్వ ఉద్యోగం విషయంలో సముచిత స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్‌ను త్వరితగతిన అందేలా చూస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:కరోనా వేళ బడికి వెళ్లలేమంటున్న విద్యార్థులు!