భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి ఉపరితల గనిని డైరెక్టర్ ఆఫ్ మైన్స్సేఫ్టీ జీవీ రంగారావు సందర్శించారు. రోజువారీగా వినియోగించే యంత్రాలను, డోర్స్ డంపర్ డ్రెస్సులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
విశాఖ ఘటన... సింగరేణి అప్రమత్తం - mines safety director ranga rao visited yellandu singareni
విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో తెలంగాణలోని అన్ని రంగాల పరిశ్రమలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని సింగరేణి ఉపరితల గనిని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ జీవీ రంగారావు సందర్శించారు.
విశాఖ ఘటన... సింగరేణి అప్రమత్తం
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టర్ రంగారావు అధికారులకు సూచించారు. రక్షణ చర్యలు చేపడుతూనే పనులు నిర్వహించాలని ఆదేశించారు. డైరెక్టర్ వెంట.. ఏజెంట్ వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ శ్రీనివాస్, మేనేజర్ రామస్వామి, ప్రాజెక్టు ఇంజినీర్ ప్రభాకరరావు పాల్గొన్నారు.