భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయంలోని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో 1008 కలశాలతో అభిషేకం చేశారు.
భద్రాద్రి రాముడికి ఘనంగా సహస్ర కలశాభిషేకం - latest news on badradri ramayya
మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు.
![భద్రాద్రి రాముడికి ఘనంగా సహస్ర కలశాభిషేకం millennial relic of Rama in Bhadradri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6012333-579-6012333-1581236446781.jpg)
భద్రాద్రి రాముడికి ఘనంగా సహస్ర కలశాభిషేకం
వివిధ నదీ జలాలు, పాలు, తేనె, నెయ్యి, పంచోదకాలు, పంచామృతాలతో స్నపనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
భద్రాద్రి రాముడికి ఘనంగా సహస్ర కలశాభిషేకం
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!