భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులనగర్ ఉన్నత పాఠశాలను డీఈవో సరోజినిదేవి సందర్శించారు. ఈ సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజన నిర్వాహకుడు మెనూ ప్రకారం పెట్టడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుడికి కొంతమంది గ్రామస్థులు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
మధ్యాహ్న భోజన వివాదం.. డీఈవో ఎదుట వాగ్వాదం - contrversy on before badradri kothgudem district educational officer
మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో ఎదుట నిరసన తెలిపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులనగర్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.
![మధ్యాహ్న భోజన వివాదం.. డీఈవో ఎదుట వాగ్వాదం midday meals contrversy on before badradri kothgudem district educational officer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6267827-thumbnail-3x2-deo.jpg)
డీఈవో ఎదుట వాగ్వాదం
కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నందున.. విచారణలో భాగంగా డీఈవో విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
డీఈవో ఎదుట వాగ్వాదం
ఇదీ చూడండి:హైదరాబాద్, దిల్లీలో కరోనా కేసులు నమోదు