పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనలకు పలువురు నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న క్షేత్ర సహాయకుల శిబిరాన్ని న్యూడెమోక్రసీ మండల సెక్రెటరీ లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఐదోరోజు కొనసాగుతున్న క్షేత్ర సహాయకుల నిరసన - ఐదోరోజు కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధి క్షేత్ర సహాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఐదో రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు, కామేపల్లి, టేకులపల్లి మండలాల క్షేత్ర సహాయకులు నిరసన ఐదోరోజు కొనసాగుతోంది.
![ఐదోరోజు కొనసాగుతున్న క్షేత్ర సహాయకుల నిరసన mgnrega field assistants protes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6426693-thumbnail-3x2-kmm-rk.jpg)
ఐదోరోజు కొనసాగుతున్న క్షేత్ర సహాయకుల నిరసన
జీత భత్యాలు పెంచాలని, 4779 జీవోను రద్దు చేయాలని క్షేత్ర సహాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా... అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఐదోరోజు కొనసాగుతున్న క్షేత్ర సహాయకుల నిరసన