తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బులు ఇవ్వడం లేదని మెప్మా ఆర్​పీ ఆత్మహత్యాయత్నం

ఇల్లందు మెప్మా ఆర్థిక వ్యవహారాలు ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లాయి. మెప్మా ఆర్​పీగా పనిచేస్తున్న సునీత ఆత్మహత్యాయత్నం చేసింది. శ్రీనిధి డబ్బులు తన వద్ద నుంచి పలువురు అధికారులు తీసుకుని ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Mepma RP commits suicide attempt , yellandu news today
డబ్బులు ఇవ్వడం లేదని మెప్మా ఆర్​పీ సూసైడ్​ అటెమ్ట్​

By

Published : Apr 10, 2021, 6:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మెప్మా ఆర్​పీగా పనిచేస్తున్న సునీత ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెప్మాలో ఆర్థిక వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెప్మాలో కొంతకాలంగా శ్రీనిధి బకాయిలు వసూలు చేసిన డబ్బులు రెండేళ్ల క్రితం.. తన వద్ద నుంచి సీఆర్​పీ యశోద, సీవో సుశీల తీసుకుని ఇవ్వలేదని ఆర్​పీ సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తీసుకెళ్లారు.

శ్రీనిధి డబ్బుల నుంచి సీఆర్​పీ యశోద 1,15,000 రూపాయలు.. సీఓ సుశీల 1,50,000 రూపాయలు తీసుకున్నారని కొంతకాలంగా ఆర్పీ సునీత ఆరోపిస్తున్నారు. కాగా తమకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదని వారు ఖండించారు. స్త్రీ నిధి వసూలు డబ్బులు చేతులు మారుతూ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ ఘటన చోటుచేసుకుంది.

పట్టణంలో 24 వార్డుల పరిధిలో 20 మందికి పైగా...ఆర్​పీలు ఉండగా.. పలు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంటారు. వారు జమ చేయకుండా కొన్ని నెలల పాటు డబ్బులను వ్యక్తిగతంగా వాడుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలో అమాయక మహిళా సంఘాలకు అన్యాయం జరగకుండా అక్రమాలకు పాల్పడే వారిపై.. అధికారులు చర్యలు తీసుకోవాలని పలు డ్వాక్రా సంఘాల మహిళలు కోరుతున్నారు.

తమ తల్లి ఆత్మహత్యాయత్నానికి సీఆర్పీ యశోద, సీవో సుశీల కారణమని బాధితురాలి కుమారుడు ఆరోపిస్తున్నాడు. డబ్బులు చెల్లించాలని నోటీసులు పంపిస్తున్నారని.. గతంలో పనిచేసిన గ్రూప్​నకు సంబంధం లేకపోయినా డబ్బులు కట్టాలని చెబుతున్నారని ఆయన అన్నాడు. ఆ కార్యాలయంలో పనిచేసే మధు అనే ఉద్యోగి సైతం మా అమ్మ డబ్బులు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి :లారీ డ్రైవర్​ అతివేగానికి నిండు ప్రాణం బలి

ABOUT THE AUTHOR

...view details